AP: సంక్రాంతి సినిమాల ప్రమోషన్లలో బిజీబిజీగా ఏపీ మంత్రులు?

AP: సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వారికి ఎంతో పెద్ద పండుగ అంతేకాకుండా సినిమాలకు కూడా సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ అని చెప్పాలి ఈ పండుగను పురస్కరించుకొని చిన్న పెద్ద సినిమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాంచరణ్ బాలకృష్ణ వెంకటేష్ వంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే సంక్రాంతికి సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏపీ కీలక మంత్రులు కూడా ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మరి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆ మంత్రులు ఎవరు అనే విషయానికి వస్తే వారు మరెవరో కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ యువ నేత మంత్రి నారా లోకేష్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు వృత్తిపరంగా నటుడు కావడంతో ఈయన తరచూ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇటీవల తన అన్నయ్య చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సినిమా గురించి ఏదైనా ఎంతో గొప్పగా చెబుతూ ప్రమోషన్లను నిర్వహించారు.
ఇలా రామ్ చరణ్ కు తన బాబాయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్ లభిస్తుంది అదే విధంగా మరోవైపు నటుడు బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నారా లోకేష్ కూడా పాల్గొన్నారని తెలుస్తుంది. ఇలా మామయ్య సినిమాకు అల్లుడు పూర్తి మద్దతు తెలుపుతున్నాడని చెప్పాలి .