మారని బాలీవుడ్ ఫేట్..మరో స్టార్ మరో డిజాస్టర్.!

గత కొన్ని రోజులు కాదు కానీ సరిగ్గా ఒక్క నెల కితం ఇదే 25 కాకపోతే జనవరి 25న బాలీవుడ్ సినిమా ఎన్నో అంచనాలు నడుమ ఎదురు చూసిన సినిమా “పఠాన్” థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అంతే ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టుగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు.

దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మాసివ్ హిట్ ఇప్పటికీ భారీ రన్ ని సొంతం చేసుకుంది. అయితే దీనితో బాలీవుడ్ కోరుకున్న హిట్ అండ్ కం బ్యాక్ వచ్చాయి అని అంతా అనుకున్నారు కానీ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కం బ్యాక్ వచ్చింది షారుఖ్ ఖాన్ కి మాత్రమే బాలీవుడ్ కి కాదని లేటెస్ట్ గా మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ సినిమా చూపించింది.

పఠాన్ తర్వాత బాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ రిలీజ్ ఇదే దీనితో మళ్ళీ అంతా గట్టిగా చూసేస్తారు అనుకుంటే తీరా చూసి ఆడియెన్స్ షాకిచ్చారు. దీనితో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 10 కోట్ల లోపే ఓపెనింగ్స్ వచ్చాయి. దీనితో మరో డిజాస్టర్ పడినట్టుగా సినీ వర్గాల్లో కన్ఫర్మ్ అయ్యిపోయింది.

దీనితో బాలీవుడ్ ఫేట్ అయితే ఏమీ మారలేదు అని అవే ప్లాప్ లు డిజాస్టర్ లు కొనసాగుతున్నాయని ట్రేడ్ చెప్తున్నారు. మరి బాలీవుడ్ కోరుకుంటున్న ఆ అసలు కం బ్యాక్ ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలి.