‎Katrina Kaif: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఆస్తుల గురించి తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల గురించి మన అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. వీరిద్దరూ ఎవరికివారు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరో హీరోయిన్లుగా తమకు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అలాగే ఇద్దరు కలిసి పలు సినిమాలలో నటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విక్కీ కౌశల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

‎ కాగా గత నాలుగైదు రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. అందుకు గల కారణం త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కావడమే. ఇటీవల ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు ఈ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ దంపతులకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన కత్రీనా చివరగా మెర్రీ క్రిస్మస్ అనే చిత్రంలో కనిపించింది. ఇక విక్కీ కౌశల్ మాత్రం ఈ ఏడాది ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

‎2025లో విడుదలైన ఈ మూవీ దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట ఆస్తులకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అయితే కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఆస్తులు రూ.265 కోట్లకు పైగానే ఉంటుంది. విక్కీ కౌశల్ ఆస్తులు రూ.41 కోట్లు.. కాగా కత్రీనా ఆస్తులు రూ.224 కోట్లు ఉంటుందని అంచనా. బాలీవుడ్‌ లో అత్యంత ధనవంతులైన తారలలో కత్రీనా, విక్కీ ఉన్నారు. విక్కీ కౌశల్ ప్రస్తుతం ఒక్కో సినిమా రూ.10 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటున్నారు. మెర్రీ క్రిస్మస్ సినిమాకు రూ.21 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. విక్కీ, కత్రీనా 2021లో రాజస్థాన్‌ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో వివాహం చేసుకున్నారు. ఈ జంట వద్ద రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB రూ. 3.28 కోట్లు, వోగ్ రూ. 2.32 కోట్లు, మెర్సిడెస్-బెంజ్ GLE రూ. 1.15 కోట్లు, ఆడి Q7, BMW 5GT వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటితోపాటు కొన్నిచోట్ల ఖరీదైన స్థలాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.