Aryan Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఆర్యన్ ఖాన్ పేరు డ్రగ్స్ వివాదం కేసులో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తరచుగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఆర్యన్ ఖాన్. కాగా తండ్రి బాలీవుడ్ లో హీరోగా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుండగా, కొడుకు డైరెక్టర్ గా మారి డైరెక్షన్ ఫీల్డ్ లో రాణిస్తున్నాడు. కాగా ఇటీవల ఆర్యన్ ఖాన్ ఇటీవలే ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే.
ఈ సిరీస్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఆర్యన్ ఖాన్ కూడా తండ్రిలాగే తన నెట్ వర్త్ పెంచుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్ 12 వేల 490 కోట్ల విలువ చేసే ఆస్తులతో వరల్డ్ లోనే టాప్ యాక్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ ఇటీవలే ఒక నివేదిక ప్రకటించింది. షారుఖ్ నటన మాత్రమే కాకుండా నిర్మాతగా, బిజినెస్ మెన్ గా సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షారుఖ్ తనయుడు ఆర్యన్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. తాజాగా ఒక బాలీవుడ్ నివేదిక ప్రకారం కేవలం ఆర్యన్ ఖాన్ నెట్ వర్త్ మాత్రమే దాదాపుగా 80 కోట్ల పైనే అని సమాచారం.
అమెరికాలో, ఇంగ్లాండ్ లో ఫిలిం మేకింగ్, ఫిలిం ప్రొడక్షన్ గురించి కోర్సులు చదివాడు ఆర్యన్. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. అనంతరం డి యావోల్ అనే ఖరీదైన క్లాతింగ్ బిజినెస్ ని కూడా స్థాపించాడు. ఇప్పుడు దర్శకుడిగా మారాడు. అంతేకాకుండా మరికొన్ని బిజినెస్ లలో కూడా ఆర్యన్ పెట్టుబడులు పెట్టాడట. ఆర్యన్ దగ్గర దాదాపు 7.83 లక్షలు విలువ చేసే ఖరీదైన వాచ్ కూడా ఉంది. ఇటీవలే ఢిల్లీలో 37 కోట్ల విలువ చేసే ఇంటిని కూడా కొనుగోలు చేశాడట ఆర్యన్. అలాగే ఆర్యన్ వద్ద ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ రెండు కార్లు, BMW లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆర్యన్ వయసు ప్రస్తుతం 27 ఏళ్ళు మాత్రమే. ఈ ఏజ్ లోనే ఇంత సంపాదించాడు. ఇదంతా కేవలం ఆర్యన్ సంపాదించింది మాత్రమే. షారుఖ్ కొడుక్కి ఇచ్చేది కలిపితే ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. ఇలా ఆస్థి పాస్తుల విషయంలో తండ్రి బాటలో ప్రయాణిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు ఆర్యన్ ఖాన్.
Aryan Khan: తండ్రి బాటలోనే కొడుకు ఆర్యన్ ఖాన్.. షారుఖ్ ఖాన్ తనయుడి ఆస్తి ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!
