Sandeep Reddy Vanga: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు దర్శకత్వం వహించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఇంకా చెప్పాలంటే తీసింది మూడు సినిమాలే అయినప్పటికీ తనకంటూ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారో. రెండు సినిమాలు చేసి ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ కూడా సందీప్ రెడ్డి వంగ సినిమాలకి, ఆయన టేకింగ్ కి ఫ్యాన్ అయిపోయాడు అంటే మాములు విషయం కాదని చెప్పాలి.
అంతలా తన మార్క్ ని క్రియేట్ చేశారు సందీప్. ప్రస్తుతం సందీప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను మించేలా సినిమాను ప్లాన్ చేస్తున్నాడట సందీప్. అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అందుకే తన మార్క్ ఆడియన్స్ పై అలానే ఉండేలా పక్కా ప్లాన్ చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగ. తన దర్శకత్వంలోనే కాదు నిర్మాణంలో కూడా సినిమాలు చేయాలనీ భావిస్తున్నాడట.
కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాడట. అయితే ఇందుకోసం సందీప్ కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నాడట. తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ పై కొత్త నటీనటులు, దర్శకులతో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇందులో భాగంగా మొదటి సినిమాకి ముహూర్తం కూడా ఖారారు చేశాడు. తన మొదటి సినిమాకు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణుని దర్శకుడిగా ఎంచుకున్నాడట. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో యూత్ ఫుల్ కంటెంట్ తో రానున్న ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించనున్నాడట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
Sandeep Reddy Vanga: సంచలన నిర్ణయం తీసుకున్న సందీప్ రెడ్డి వంగ.. చిన్న హీరోతో సినిమా!
