మోదీ ప్రశంసలు ప్రత్యేకమంటున్న నాగార్జున.. నాగచైతన్య దంపతులు కూడా!

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కినేని నాగేశ్వరరావు సినీ పరిశ్రమకు చేసిన కృషి గురించి మాట్లాడుతూ ఆయనని ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రశంసలు మాకు ఎంతో ప్రత్యేకం అంటూ ఆయనకి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టల్ పెట్టారు నాగార్జున మరియు నాగచైతన్య దంపతులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 117వ ఎపిసోడ్ కొనసాగింది.

ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా, రాజ్ కపూర్ మరియు ఏఎన్నార్ ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు వారు అందించిన సేవలను గురించి కొనియాడారు, తెలుగు సినిమాని అక్కినేని నాగేశ్వరరావు మరో స్థాయికి తీసుకు వెళ్లారని ఆయన సినిమాల్లో భారతీయ సాంప్రదాయాలు విలువలు చాలా చక్కగా చూపించే వారిని పేర్కొన్నారు.

తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని, రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశాయని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో వెల్లడించారు.అయితే ఈ ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ ఐకానిక్ లెజెండ్స్ తో పాటు నాన్నగారి శతజయంతి సందర్భంగా ఆయన ని గౌరవించడం ఆనందకరం. ఆయన అభినందనలు మాకు చాలా ప్రత్యేకం అంటూ సోషల్ మీడియా సాక్షిగా మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ, మోదీ మాట్లాడిన వీడియోని కూడా తన ఖాతాలో పోస్ట్ చేశారు నాగార్జున.

అలాగే నాగచైతన్య దంపతులు కూడా అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది.మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రధానమంత్రి అక్కినేని నాగేశ్వరరావు ని ప్రశంసిస్తూ మాట్లాడటం అనేది వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదని యావత్ తెలుగు జాతికి గర్వకారణమే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తెలుగు వారు మరియు అక్కినేని అభిమానులు.