Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీకి సినీ నటుడు అక్కినేని నాగచైతన్య శోభిత దంపతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ఈ కార్యక్రమం ప్రస్తుతం 117వ ఎపిసోడ్ కొనసాగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి సేవలను చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని జాతీయ స్థాయికి చేర్చినటువంటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంటూ ఆయన గురించి ప్రస్తావిస్తూ ఏఎన్ఆర్ గురించి గొప్పగా చెప్పారు.
ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపించేవారని పేర్కొన్నారు. తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని, రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశాయని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో వెల్లడించారు. ఇలా అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడటంతో ఈ విషయంపై అక్కినేని కుటుంబ సభ్యులు స్పందించారు.
ఇలా నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై నాగార్జున స్పందిస్తూ..ఐకానిక్ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏయన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏయన్నార్ దూరదృష్టి, ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి అంటూ మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక నాగచైతన్య శోభిత దంపతులు కూడా ఈ విషయంపై స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.
