హైపర్ ఆది వ్యక్తిత్వం అలాంటిది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రైజింగ్ రాజు..!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా అద్భుతమైన అవకాశాలను అందుకొని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది, రైజింగ్ రాజు ఒకరు. హైపర్ ఆది మాత్రమే కాకుండా రైజింగ్ రాజు టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. పేరుకు మాత్రమే రైజింగ్ రాజు టీమ్ లీడర్ అయినప్పటికీ వ్యవహారం మొత్తం ఆది చూసుకునేవారు.


ఇలా హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ లో భాగంగా చేసే స్కిట్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం వరకు రైజింగ్ రాజు హైపర్ ఆది స్కిట్ లో ఎక్కడా కనిపించలేదు. అందుకు గల కారణం ఏమిటి అంటూ ఎంతో మంది నెటిజన్లు ఆరా తీశారు. కొందరు రైజింగ్ రాజు జబర్దస్త్ మానేశారు అంటూ కూడా వార్తలను సృష్టించారు.అయితే ప్రస్తుతం రైజింగ్ రాజు తిరిగి ఆది టీమ్ లో సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక సందర్భంలో రైజింగ్ రాజు మాట్లాడుతూ ఆది వ్యక్తిత్వం గురించి బయట పెట్టారు. కరోనా సమయంలో తాను ఒక ఆరు నెలల పాటు జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనలేదని వెల్లడించారు. అలా పాల్గొనకపోవడాకి గల కారణం ఆ సమయంలో తనకు మనవరాలు పుట్టడం వల్ల తాను బయట తిరిగివస్తే తన మనవరాలు ఆరోగ్యానికి ప్రమాదమని భావించి ఆరునెలల పాటు ఇంటిపట్టునే ఉన్నానని అయితే ఆ ఆరు నెలలు ఎలాంటి స్కిట్ లలో పాల్గొనకపోయినా హైపర్ ఆది తనకు ప్రతి నెల కరెక్ట్ సమయానికి డబ్బులు పంపించేవారని వెల్లడించారు. ఆది వ్యక్తిత్వం అంత మంచిది అంటూ ఈ విషయం గురించి చెబుతూ ఎమోషన్ అయ్యారు.