సిక్స్ ప్యాక్ తో సందడి చేస్తున్న సందీప్ కిషన్.. హార్డ్ వర్క్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

ఇప్పటి హీరోలు యాక్టింగ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో ఫిజిక్ మీద కూడా అంతకంటే ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తున్నారు. జిమ్ కి వెళ్లడం, డైట్ ఫాలో అవ్వటం, వర్కౌట్స్ చేస్తూ బాడీ షేప్ మైంటైన్ చేయటం ఇవన్నీ అత్యవసరంగా భావిస్తున్నారు నేటి తరం హీరోలు. అందుకే చాలా మంది సిక్స్ ప్యాక్ తో కనిపిస్తూ సినిమాలలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు యువ నటుడు సందీప్ కిషన్ కూడా ఆ కోవలోనే చేరిపోయాడు.

ఇప్పటివరకు సాధారణ బాడీతో కనిపించిన సందీప్ కిషన్ ఇప్పుడు సిక్స్ ప్యాక్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు. పూర్తిగా తన బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్న సందీప్ కిషన్ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యామిలీ మెన్ సీజన్ 3 కోసమే తన లుక్స్ ని మార్చుకుంటున్నట్లు తెలిపాడు. నటన విషయంలో మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కానీ బాడీని మార్చి చూపించమని రాజ్ అండ్ డీకే చెప్పడంతోనే తన లుక్స్ మార్చుకుంటున్నట్లు వివరించాడు సందీప్.

రోజు జిమ్ చేసేవాడట కానీ డైట్ విషయంలో మాత్రం ఎక్కువ మార్పులు చేయలేదని సింపుల్ టిప్స్ మాత్రం ఫాలో అవుతానని తెలిపాడు. రోజుకి రెండుసార్లు వర్కౌట్ చేయడంతో పాటు డైట్ విషయంలో షుగర్, ఫ్రైడ్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయడంతో పాటు సోడాలు తాగటం ఆల్కహాల్ తాగడం పూర్తిగా తగ్గించేసానని చెప్పాడు సందీప్ కిషన్. మధ్యాహ్నం మాత్రం రోజు రైస్ తీసుకుంటానని, రైస్ లోకి ఎక్కువగా చేపల పులుసు తీసుకుంటానని లేదంటే మూడు రకాల వెజ్ కర్రీలతో నెయ్యి వేసుకుని తింటానని చెప్పాడు.

బ్రేక్ ఫాస్ట్ గా ఫ్రూట్స్, నట్స్ తింటానని క్లీన్ అండ్ హెల్దీ ఫుడ్ ని తీసుకోవడం వల్లనే తాను హెల్తీగా ఫీట్ గా ఉన్నట్లు చెప్పాడు సందీప్ కిషన్. అలాగే రాత్రిపూట చేపలు, ఎగ్, అవకాడో, చికెన్ తింటాడట ఈ యువ హీరో. సందీప్ కిషన్ కి సినిమాల మీద ఉండే ప్యాషన్, చేస్తున్న హార్డ్ వర్క్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ అతనికి హాట్సాఫ్ చెప్తున్నారు. అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని ఆశిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.