Pawan Kalyan: సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం… ఇక పై అలా చేయనున్నారా?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈయన ప్రతినెల రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో పర్యటన చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇలా కొత్త ఏడాది నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది రాష్ట్రంలో ప్రతినెల ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ ఆ జిల్లాలోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇలా ప్రజలలోకి వస్తే ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది స్పష్టం అవుతుందని అందుకే ఈయన కూడా జనంలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జిల్లాల్లోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రజలతో నేరుగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు.

ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం లేకపోలేదు ఇటీవల కడపలో ఎంపీడీవో పై వైకాపా నేతలు దాడి చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కడప రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఎంపీడీవోని పరామర్శిస్తూ ఉద్యోగులకు కూడా భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. అధికారం లేకపోయినా వైకాపా నేతలు ఇలా అధికారులపై దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఈయన ప్రతినెల ఒక్కో జిల్లాలో పర్యటన చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇలా పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది వైకాపా నేతలు కూడా విమర్శలు కురిపిస్తున్నారు వచ్చే నెల నుంచి జగన్మోహన్ రెడ్డి సైతం కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ జనంలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు సంక్రాంతి తర్వాత ప్రతి జిల్లాలోనూ రెండు రోజులపాటు నిద్ర చేస్తూ అక్కడ ప్రజల కష్టాలను క్షేత్రస్థాయిలో వారిని అడిగి తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇలా జగన్ ప్రజలలోకి రాబోతున్న నేపథ్యంలో పవన్ కూడా ఇలాంటి ప్లాన్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.