Salman Khan: వామ్మో.. సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ అన్ని కోట్లా.. ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఈ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు సల్మాన్ ఖాన్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించడంతో పాటు, కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ కు సౌత్ ఇండస్ట్రీలో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే సల్మాన్ ఖాన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలలో వచ్చిన లాభాలను బిజినెస్ లలో పెట్టుబడిగా పెడుతూ బాగానే సంపాదిస్తున్నారు.

అలా రెండు చేతుల సంపాదిస్తున్నారు సల్మాన్ ఖాన్. అలాగే బాగానే ఆస్తులు పోగేసుకున్నారు. ఇకపోతే ఆయన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగానే ప్రస్తుతం సికిందర్ అనే సినిమాలో నటిస్తుండగా ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. కాగా తాజాగా ఈనెల 27వ తేదీన సల్మాన్ ఖాన్ తన 59వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి సైతం తన సన్నిహితుల కోసం స్పెషల్ బర్త్ డే పార్టీ నిర్వహించాడు సల్మాన్. అలాగే సల్మాన్ కోసం అనంత్ అంబానీ పార్టీని ఏర్పాటు చేశారు.

గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ లో ఈ ప్రత్యేక పార్టీ జరిగింది. ఈ క్రమంలో సల్మాన్ కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ ధరించిన డైమండ్ వాచ్ ఫై అందరి దృష్టిపడింది. అదే డైమండ్ వాచ్ ని సల్మాన్ ఖాన్ అంబానీ పెళ్లిలో కూడా ధరించారు. అయితే ఇటీవల కొన్ని నెలల క్రితం అమెరికన్ లగ్జరీ వాచ్, జ్యువెలరీ బ్రాండ్ జాకర్ & కంపెనీ యజమాని జాకబ్ అర్బో తన బిలియనీర్ III అనే లగ్జరీ వాచ్‌ ను సల్మాన్ ఖాన్‌కు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వాచ్ 714 తెల్లని వజ్రాలతో నిండి ఉంది. సల్మాన్‌ ఖాన్‌ ధరించిన డైమండ్‌ వాచ్‌ను జాకోబారాబో అనే సంస్థ తయారు చేసింది. ఈ వాచ్ ప్రపంచంలో కేవలం 18 మంది మాత్రమే కలిగి ఉన్నారు. దీన్ని బట్టి ఈ వాచ్ ఎంత ఎక్స్పెన్సివ్ ఎంత క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ వాచ్ ధర తెలిస్తే నిజంగా షాక్ అవడం ఖాయం. ఈ వాచ్ ధర 7.7 మిలియన్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా 65 కోట్ల రూపాయలు. ఇంత ఖరీదైన వాచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వాచ్ ధర తెలిసి అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఆ ఒక్క వాచ్ తో పదుల సంఖ్యలో మధ్యతరగతి కుటుంబాలు లైఫ్ లాంగ్ బతికేయొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వామ్మో ఆ అంత సింపులుగా కనిపిస్తున్న ఆ వాచ్ ధర ఏకంగా అన్ని కోట్లా అంటూ ఇంకొందరు షాక్ అవుతున్నారు.