నాడోడిగల్ అనే తమిళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ మంచి పేరు తెచ్చుకొని తరువాత ఎన్నో తెలుగు సినిమాల ద్వారా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న నటి ఈమె. ఆమె అందం, అభినయం చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే ఆమెకి మాటలు రావు, వినబడదు. అయితే ఆమె నటన చూసిన వారు ఎవరైనా ఆమెకి అలాంటి ఒక లోపం ఉంది అంటే అసలు నమ్మరు. అయినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ మంచి బిజీగా ఉన్న ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె నుండి అభినయ.
తెలుగులో నేనింతే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది అభినయ. తర్వాత శంభో శివ శంభో, దమ్ము, డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారు గది 2 సీతారామం, మార్క్ ఆంటోనీ, గామి, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం కన్నడం భాషలలో కూడా చాలా సినిమాలు చేసింది అభినయ. తన తోటి నటీనటులకు సీన్ లోకి ఎంటర్ అయ్యే వరకు ఆమెకి అలాంటి ఒక లోపం ఉందని తెలియదట. తీరా నటించేటప్పుడు ఆమె లోపం చూసి షాక్ అయ్యే వారట. తర్వాత ఆమె టాలెంట్ కి ఆశ్చర్య పోవడం వారి వంతు అయ్యేది.
నాడోడిగల్ సినిమాకు అభినయ ఫోటోలు చూసిన డైరెక్టర్ సముద్రఖని ఆమెను ఓకే చేశారు. తర్వాత ఆమె మూగ,చెమిటి అని తెలిసి ఆమెని పక్కనపెట్టి ముంబై నుంచి మరో హీరోయిన్ ని తీసుకొచ్చాడు సముద్రఖని. అయితే వచ్చినామే ఆ తమిళ భాష ఏంటో అంటూ చిరాకు పడి సినిమా చేయని చెప్పేసింది. దాంతో అభినయతోనే సినిమా తీశాడు సముద్రఖని. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా తెలుగులో శంభో శివ శంభో గా రిలీజ్ అయింది.
ఉత్తమ సహాయ నటిగా ఎన్నో అవార్డులు అందుకుంది అభినయ. అంతేకాదు ఈమె హాలీవుడ్లో ఓన్ లిటిల్ ఫింగర్ అనే సినిమా కూడా చేసింది తనలో వైకల్యాన్ని చూసి బాధపడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న అభినయని చూస్తే శభాష్ అనవలసిందే. చిన్న చిన్న లోపాలకి దేవుడిని నిందిస్తూ చాలామందికి అభినయ ఒక ఇన్స్పిరేషన్ అనటంలో ఏమాత్రం అతిశయం లేదు.