Unstoppable With NBK: అన్‌స్టాప‌బుల్‌ షోలో డాకు మ‌హారాజ్ ద‌ర్శ‌కుడు.. సందడే సందడి..ఫొటోస్ వైరల్!

Unstoppable With NBK: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అలాగే రాజకీయ నాయకుడిగా ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు సినిమాలలో ఒక రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు బాలయ్య బాబు. సినిమాల పరంగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకుంటు దూసుకుపోతున్నారు. మరోవైపు రాజకీయపరంగా కూడా సక్సెస్ అవుతున్నారు. ఇకపోతే బాలయ్య బాబు అన్‌స్టాప‌బుల్‌ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ప్ర‌స్తుతం నాలుగో సీజ‌న్ న‌డుస్తోంది. అయితే ఇప్పటికే ఏడు ఎపిసోడ్‌ లు స్ట్రీమింగ్ కాగా వాటికి అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. ఇక ఎనిమిదో ఎపిసోడ్‌ కు ఎవ‌రు రాబోతున్నారా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. దీంతో నెక్స్ట్ ఎపిసోడ్ కి ఎవరు రాబోతున్నారు అన్న విషయాన్ని తెలిపారు షో నిర్వాహకులు. డాకు మహారజ్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా దర్శకుడు బాబి, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ లు అన్‌స్టాప‌బుల్‌ లో సందడి చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేసారు.


తన టీమ్ రావడంతో బాబు ఎప్పటిలాగే ఆటలు పాటలతో సందడి సందడి చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే బాబీ ద‌ర్శ‌క‌త్వం వహించిన డాకు మహారాజ్ మూవీలో బాల‌కృష్ణ హీరోగా నటించిన విషయం తెలిసిందే. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ లుగా నటించారు. బాబీ దేవోల్‌, చాందిని చౌద‌రి ముఖ్య‌పాత్ర‌ల్లో నటించారు. సంక్రాంతి పండుగ కనుక జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే మూవీ మేకర్స్ అన్‌స్టాప‌బుల్‌ షోలో పాల్గొన్నారు..