Allu Arjun: తప్పు మొత్తం అల్లు అర్జున్ దేనా… కొత్త పలుకులతో క్లారిటీ ఇచ్చిన ఆర్కే?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం గోరుతోపోయే దానిని గొడ్డలితో పోయేలా చేసుకున్నారు అనే విధంగా ఉందంటూ ఆర్కే ఈ విషయం గురించి ప్రస్తావన చేశారు. కొత్త పలుకులు ద్వారా అల్లు అర్జున్ ఆర్టికల్ రాసిన ఆర్కే తప్పు మొత్తం అల్లు అర్జున్ దే అంటూ చెప్పకు వచ్చారు. ఆయన తన ఈగో కారణంగా సమస్యను అంతకంతకూ పెంచుకుంటూ పోయారని అది టాలీవుడ్‌కే పెను ముప్పుగా మారిందని ఆర్కే తేల్చేశారు. ఇంత చేసినా రేవంత్ కూడా తగ్గేదేలే అనే విధంగా వ్యవహరించారని తెలిపారు.

ఇలా ఈ గొడవ జరగడానికి కారణం ఈ సినిమా సక్సెస్ మీట్. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటమే కారణమని ఆర్కే తెలిపారు. ఇలా రేవంత్ రెడ్డి తన పేరును మర్చిపోయినందుకు విచారం వ్యక్తం చేయాలని ఆయనకు సూచించిన ఇది రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేనిదని తాను ఈ విషయంలో విచారణ వ్యక్తం చేయను అంటూ అల్లు అర్జున్ తేల్చి చెప్పారు.. ఇక ఈ విషయాన్ని మరోవైపు కేటీఆర్ తన రాజకీయాలకు అనుగుణంగా మార్చుకొని రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టారు అని చెప్పాలి.

ఇక ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మరొక పెద్ద తప్పు అయింది అల్లు అరవింద్ చెప్పినా వినే స్థాయిని దాటి అల్లు అర్జున్ వెళ్లిపోయారు. ఇక ఆయన ఎవరు చెప్పినా వినరని తెలిపారు. పనిలో పనిగా టాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఈయన విమర్శలు కురిపించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం డొల్ల అంటూ తెలిపారు. వందల కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ హీరోలు తీసుకుంటూ ఆ భారాన్ని బెనిఫిట్ షో ద్వారా ప్రేక్షకులపై వేస్తున్నారని తెలిపారు. సినిమాలు ఎలా చేయాలో మలయాళ చిత్ర పరిశ్రమను చూసి నేర్చుకోవాలని ఈయన తెలిపారు.

అల్లు అర్జున్ వ్యవహారంలో ఆయనకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి మద్దతు రాలేదని 70% రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతు తెలిపారని ఆర్కే గుర్తు చేశారు. ఇక అల్లు అర్జున్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి కూడా ఆర్కే తప్పు పట్టారు.. ఇలా అల్లు అర్జున్ పరామర్శించడం వల్ల రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినట్టేనని తెలిపారు. ఇలాంటి తప్పులు చేయడం చంద్రబాబుకు అలవాటే అంటూ ఆర్కే తన కొత్త పలుకుల ద్వారా అల్లు అర్జున్ గురించి ఆర్టికల్ రాస్తూ తప్పు మొత్తం అల్లు అర్జున్ దేనిని తేల్చి చెప్పారు.