సింప్లిసిటీలో తండ్రినే మించిపోయింది.. వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం కూతురి వీడియో!

సాధారణంగా సినీ సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ సినీ నటుడుగా ఉన్నప్పుడు కూడా పెద్దగా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయలేదు. సింపుల్ సిటీలో ఆయనకి పెట్టింది పేరు. ఇప్పుడు రాజకీయాలలో కూడా ఆయన అదే సింప్లిసిటీని మెయింటైన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా ఉన్నా కూడా ఆడంబరాలకు హంగామాకి అసలు ప్రాధాన్యం ఇవ్వటం లేదు.

నలుగురితో పాటు సాధారణ మనిషిలా తిరుగుతూ గ్రామాలని సందర్శిస్తున్న ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన కుమార్తె ఆద్య కూడా అదే సింప్లిసిటీ ని మైంటైన్ చేస్తూ నలుగురితో శభాష్ అనిపించుకుంటుంది. ఇంతకీ ఏం జరిగిందంటే తల్లి రేణు దేశాయ్ తో ఈ మధ్యనే కాశీయాత్రకి వెళ్లింది ఆద్య. అక్కడ సింపుల్గా ఆటో రిక్షాలో తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించింది.

కారులో ప్రయాణం చేసే స్టేటస్ ఉన్నప్పటికీ సాదాసీదాగా ఆటోలో ప్రయాణం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు రేణు దేశాయ్ తను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. వీడియో చూసిన వాళ్ళు తండ్రికి తగ్గ తనయ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆధ్య చూడటానికి చాలా అందంగా, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఈ సంవత్సరం స్వాతంత్ర వేడుకలకి, తిరుమల పర్యటనలకి తండ్రితో కలిసి కనిపించింది ఆధ్య.

ఆమెలో ఎక్కడా డిప్యూటీ సీఎం కూతురు అనే దర్పం కనిపించదు. ఇక కొడుకు అకిరా నందన్ కూడా పెద్దగా హడావిడి చేస్తూ కనిపించడు. ఎప్పుడు సింపుల్ గా కనిపించే అకీరా చిత్ర పరిశ్రమ లోకి రాబోతున్నట్లు అనేక వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ జి సినిమాలో అకిరా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై అటు మూవీ టీం గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని అధికారికంగా స్పందించలేదు.