Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం అంటే సినిమాల్లో సరిగ్గా నటించలేదు కానీ ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా మిగిచాయి. ఇకపోతే అనుష్క శెట్టికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికి తెలిసిందే. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క. ఈమెకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న విషయం మన అందరికి తెలిసిందే. కాగా అనుష్క గురించి చెప్పాలి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సౌందర్య తర్వాత ఇండస్ట్రీలో ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న హీరోయిన్ మన స్వీటి అనుష్క అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు.
సూపర్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస టాప్ సినిమాలతో దూసుకుపోయింది. తొలి నాళ్లలో గ్లామర్ పాత్రల్లో అదరగొట్టింది. ఆ తర్వాత పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాలలో, సోలో లీడ్ లో దుమ్మురేపింది. తెలుగునాట లేడీ సూపర్ స్టార్ గా చలామణి అయింది. కానీ సైజ్ జీరో తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఏడాదికో, రెండేళ్లకో సినిమాతో పలకరిస్తుంది. ఇకపోతే అనుష్క చివరగా గత ఏడాది 2023లో మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుష్క రెండు తెలుగు సినిమాలతో పాటు ఒక మలయాళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇకపోతే అనుష్క సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ మన స్వీటీ ఫాలో అయ్యేది మాత్రం కేవలం 12 మందిని మాత్రమే. అందులో మన తెలుగు హీరోలు కేవలం ఇద్దరంటే ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఉండగా కేవలం ఆ ఇద్దరు హీరోలను మాత్రమే ఫాలో అవుతోంది అనుష్క శెట్టి. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు ఒకరు ప్రభాస్ కాగా మరొకరు రానా. మిగిలిన వారు కృతి శెట్టి, రాజమౌళి,కాజల్ అగర్వాల్,పీవీ సింధు, దుల్కర్ సల్మాన్ వంటి వారిని కూడా ఫాలో అవుతోంది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కేవలం 12 మందిని ఫాలో అవుతుండగా ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరు హీరోలనే ఫాలో అవ్వడం కొంచెం ఆశ్చర్యపోవాల్సిన విషయం అని చెప్పాలి.