Madhuri: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దివ్వెల మాధురి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ వైకాపా ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే ఈయన తన భార్య వానిని కాకుండా దివ్వెల మాధురి వద్ద అంటూ ఆమెతో సహజీవనం చేస్తున్నారు. ఇక ఇదే విషయం గత కొద్ది రోజుల క్రితం బయటకు రావడంతో వీరి వివాదం కాస్త పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.
ఈ విధంగా మాధురి దువ్వాడ శ్రీనివాస్ రిలేషన్ బయటపడటంతో వీరి కూడా బహిరంగంగానే బయట జంటగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. అలాగే ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. తాను గత కొద్ది కాలంగా తన భార్య బిడ్డలతో సంతోషంగా లేనని ఆ సంతోషం నాకు మాధురి వద్ద దొరికిందని అందుకే తనతో కలిసి ఉంటున్నానని ఈయన క్లారిటీ ఇచ్చారు.
ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్న మాధురి శ్రీనివాస్ ఈ కేసుల నుంచి బయటపడగానే పెళ్లి కూడా చేసుకుంటాము అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ పై కూటమినేతలు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధురి పవన్ కళ్యాణ్ కు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక కామన్ మ్యాన్ గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి వైసిపి నేతల గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు.పవన్ వైకాపా నేతల్లారా రండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. వైకాపా నేతగా దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఆయన వైకాపా తరఫున మాట్లాడేరే తప్ప ఇంకెలాంటి తప్పు చేయలేదు ఇలా గత రెండు సంవత్సరాల క్రితం చేసిన ఈ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేసులు పెట్టి తనని ఇబ్బందికి గురి చేస్తాము అంటే చూస్తూ ఊరుకోమని ఈమె వార్నింగ్ ఇచ్చారు.
కేసుల సాకుతో అరెస్టులు చేస్తే మాత్రం నిరసనలు తప్పవని.. రాజాను అరెస్ట్ చేసి చూడండి అంటూ దివ్వెల మాధురి హెచ్చరించారు.దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేస్తే.. ఆయన అభిమానులు రోడ్డున పడతారని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఏపీ సర్కారుతో మాట్లాడేది లేదని.. ఏం జరిగినా ధీటుగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు.
ఒక్కసారి నా రాజాని అరెస్ట్ చేసి చూడండి .. పవన్ కు దివ్వెల మాధురి వార్నింగ్..@PawanKalyan @JanaSenaParty #DivvelaMadhuri #DuvvadaSrinivas #YSRCongress #RTV pic.twitter.com/4bjmSeoJjk
— RTV (@RTVnewsnetwork) December 28, 2024