గ్లోబల్ స్టార్ కి ఫ్యాన్స్ ఇచ్చిన సర్ప్రైజ్.. దేశంలోనే అతిపెద్ద కటౌట్, పుష్పాభిషేకం కూడా!

కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ నేరుగా తెలుగులో తీస్తున్న మొదటి సినిమా గేమ్ చేంజర్.ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది మూవీ టీం. అయితే రామ్ చరణ్ అభిమానులు ఆయనకి చాలా పెద్ద బహుమతిని ఇస్తున్నారు. బహుశా రాంచరణ్ కూడా ఇంత పెద్ద సర్ప్రైజ్ ని ఊహించి ఉండరు.

ఇంతకీ ఆ బహుమతి ఏమిటంటే విజయవాడలో బృందావన కాలనీలో ఉన్న వజ్రమైదానంలో 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటౌట్ ని ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ దేశంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. ఈ కటౌట్ ని సినిమా నిర్మాత దిల్ రాజు నేడు ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా పాల్గొబోతున్నారు.

అనంతరం హెలికాప్టర్ ద్వారా కటౌట్ కి పూలాభిషేకం జరిపిస్తారు. ఇక ఈ కటౌట్ పూర్తి మాస్ లుక్ తో కనిపిస్తున్న రామ్ చరణ్ లుంగీతో బ్లాక్ కలర్ బనియన్ తో కనిపిస్తున్నారు. ఈ కటౌట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ కటౌట్ కోసం నెల రోజులు ముందు నుంచి విజయవాడలో ఏర్పాట్లు ప్రారంభించారు అభిమానులు. ఇప్పటివరకు దేశంలో ప్రభాస్ ది మాత్రమే అతిపెద్ద కటౌట్ ఉండేది.

ఇప్పుడు దాన్ని మించి రాంచరణ్ అభిమానులు కటౌట్ పెట్టడంతో ఆ కటౌట్ వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు అభిమానులు. నిజంగా రామ్ చరణ్ కి ఇలాంటి గౌరవం దక్కటం మామూలు విషయం కాదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అయిన అంజలి మరొక కీలక పాత్రని పోషిస్తుంది. ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం పోలీసుల దగ్గర నుంచి పూర్తి అనుమతులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు రామ్ చరణ్ అభిమానులు.