నటుడు విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో అంతకంటే డబల్ సక్సెస్ ఇచ్చిన మూవీ గీత గోవిందం. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ 100 కోట్ల హీరోగా రూపాంతరం చెందాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ ఈ మధ్య అతనికి చెప్పుకోదగ్గ హిట్ లేదని చెప్పాలి.
విజయ్ సినిమాలో అతనికి అతిపెద్ద ఫ్యాన్ బేస్ ని సంపాదించి పెట్టిన సినిమా అంటే గీత గోవిందం అనే చెప్పాలి. ఈ సినిమా అటు విజయ్ దేవరకొండ కి ఇటు డైరెక్టర్ కి హీరోయిన్ రష్మిక కి పూలబాట వేసిందని చెప్పాలి. అంతే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి ఫ్యూచర్ ని చూపించింది. అందుకు ఉదాహరణ అనీషా దామా. ఈ పేరు చెప్తే మీరు గుర్తించలేకపోవచ్చు.
కానీ ఈ సినిమాలో విజయ్ ని ప్రేమించే స్టూడెంట్ పాత్రలో నటించిన అమ్మాయిని మీరు గుర్తుపట్టగలరు. అమాయకమైన మొహంతో విజయ్ తన వెంటపడేలా చేసుకోవడానికి ఏం చేయడానికైనా వెనకాడని పాత్రలో కనిపిస్తుంది ఈ చిన్నది. సినిమాలో కనిపించింది కాసేపే అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అనిషా. 2014లో ‘వయా పాపికొండలు’ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత 2017లో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో చిన్న రోల్‌లో నటించింది అనీషా.
ఈ మధ్యనే ఈమె సత్తి గాని రెండెకరాలు, పెళ్లికూతురు పార్టీ సినిమాల లో హీరోయిన్ గా నటించింది. అయితే ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ‘షైతాన్’ అనే వెబ్‌సిరీస్‌లో క్యామియో చేసింది అనీషా. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇక సోషల్ మీడియాలో ఈ వయ్యారిభామ పెట్టే ఫోటోలు కుర్ర కారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈమె ఫోటోలు చూసినవాళ్లు గీతగోవిందం చిన్నదా అంటూ ఆశ్చర్యపోతున్నారు.