మన దేశంలో చాలామంది స్ట్రీలు నుదుటన బొట్టు పెట్టుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే నుడుట బొట్టు పెట్టుకోవడం వెనుక కూడా సైన్స్ ఉంది. మన శరీరంలో ఏడు చక్రాలు ఉండగా ఆ చక్రాలలో ఆరో చక్రమే మూడో కన్నుగా పిలవడం జరుగుతుంది. కనుబొమ్మల మధ్య ఉండే నుదురు భాగం ప్రధాన నాడీకేంద్రమైన ఈ బిందువు శక్తినీ ఏకాగ్రత పెంచడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు.
మహిళలు, పురుషులు తేడా లేకుండా నుదుట సింధూరం, కుంకుమ, విభూతి ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మహిళలు నుదుటన ఒకే చోట బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. కుంకుమ, స్టిక్కర్లు పెట్టడం ద్వారా చర్మ సమస్యలు తలెత్తుతాయని చాలామంది చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. విశాలమైన నుదురు కలిగిన మహిళలు పెద్ద బొట్టు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారని నమ్ముతారు.
చిన్ని నుదురు కలిగిన మహిళలు కనుబొమ్మలకు మధ్య చిన్న బొట్టును పెట్టుకోవడం ద్వారా మరింత అందంగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గుండ్రపు ముఖం కలిగిన వారు కాస్త పెద్ద బొట్టును ఎంచుకోవడం లేదా గుండ్రపు ఆకారంలో వున్న స్టిక్కర్లను వాడటం చేస్తే మంచిది. నుదుటన ఒకేచోట బొట్టు పెడితే చర్మం తెలుపుగా మారడంతో పాటు ఇన్ఫెక్షన్లు వస్తాయి.
స్టిక్కర్లను ఉపయోగించకుండా నాణ్యత కలిగిన కుంకుమను నుదుట ధరించడం ద్వారా సౌభాగ్యంతో పాటు ఆరోగ్యం చేకూరే ఛాన్స్ అయితే ఉంటుంది. స్త్రీలు నుదుటన బొట్టు పెట్టుకోవడం వల్ల లాభాలే తప్ప నష్టాలు అయితే ఉండవనే సంగతి తెలిసిందే.