Vijay Varma: వింత వ్యాధితో బాధపడుతున్న తమన్నా ప్రియుడు విజయ్ వర్మ… భలే కవర్ చేస్తున్నాడే?

Vijay Varma: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి తమన్న ఒకరు. ఈమె ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ సినిమాలలో మాత్రం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇక తమన్న గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే స్వయంగా ఈ విషయాన్ని తమన్న ఓ సందర్భంలో వెల్లడించారు.

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత పెళ్లెప్పుడు చేసుకుంటారు అంటూ వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. తమన్నాతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు అందరూ కూడా పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు కానీ తమన్నా మాత్రం ఇప్పటి వరకు పెళ్లి మాటే ఎత్తలేదు దీంతో వీరు పెళ్లి ఎప్పుడు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇక వీరి పెళ్లి గురించి ఎప్పుడు శుభవార్త చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో విజయ్ వర్మకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన గత కొంత కాలంగా చర్మ సమస్యలతో బాధపడుతున్నారంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది అయితే ఈ వార్తలపై స్వయంగా విజయ్ వర్మ స్పందించారు.

ఈ సందర్భంగా విజయ వర్మ మాట్లాడుతూ తాను గత కొంతకాలంగా విటిలిగో అనే చర్మ సమస్యతో బాధపడుతున్నానని అన్నాడు.ఇది తెలుగులో బొల్లి పేరుతో పిలుస్తుంటారు. అయితే ఇది అంటు వ్యాధి కాదని తెలుస్తోంది. దాని వల్ల తన ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, వాటి వల్ల మొదట్లో కాస్త భయపడ్డాను కానీ ఏలాంటి ప్రమాదం లేదని తెలిసిందని తెలిపారు. అయితే ఆ మచ్చలు కనపడకుండా ఉండటం కోసం కాస్మెటిక్ మేకప్ వాడుతానని విజయ్ వర్మ తెలిపారు. ఇక తర్వాత సినిమాలలో బిజీ కావటం వల్ల తాను ఈ విషయం గురించి ఆలోచించడమే మర్చిపోయాను అంటూ ఈ సందర్భంగా తనకున్నటువంటి చర్మ సమస్యల గురించి విజయ్ వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.