మనలో చాలామంది పానీపూరీని ఎంతో ఇష్టంగా తింటారు. పానీపూరీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పానీపూరీ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. పానీపూరీలో శరీరానికి మేలు చేసే పొటాషియం, మెగ్నీషియంతో పాటు ఫోలేట్ విటమిన్లు ఉన్నాయి. పానీపూరీ తయారీలో ధనియాల పొడి, పుదీనా, జీలకర్ర పొడులను వినియోగిస్తారు.
నోటిపూత సమస్యతో బాధ పడుతున్న వాళ్లు పానీపూరి తినడం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పానీపూరీలో వాడే నల్ల ఉప్పు, మామిడి, ఎండుమిర్చి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విషయంలో పానీపూరీ తోడ్పడుతుంది. అధిక బరువు సమస్యతో బాధ పడేవాళ్లు పానీపూరీ తినడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
అయితే పానీపూరీని మితంగా తీసుకుంటే మాత్రమే ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. పానీపూరీని ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. పానీపూరిలో స్టఫ్ చేసే మిశ్రమాన్ని శనగలతో తయారుచేస్తారు. ఈ శనగలలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. శనగల మిశ్రమాన్ని స్టప్ చేసే పానీపూరి తినడానికి ప్రయత్నించండి.
పానీపూరీ పానీ తయారీలో జీలకర్ర, కొత్తిమీర, పుదీన, అల్లం మొదలైనవి ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియకు చాలా బాగా సహాయపడతాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తాయి.