మనలో చాలామంది వాము నీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతూ ఉంటారు. వాము గింజలను తీసుకోవడం ద్వారా పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం లభించే అవకాశాలు ఉంటాయి. వాము గింజలు జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో వాము గింజలు ఎంతగానో తోడ్పడతాయి.
అజీర్ణం, ఉబ్బరం, ఆపానవాయువు సమస్యలకు చెక్ పెట్టడంలో వాము నీళ్లు తోడ్పడతాయి. వాము తీసుకోవడం వల్ల బరువు సులువుగా తగ్గే అవకాశాలు ఉంటాయి. వాము నీరు తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు, ఆస్తమా లక్షణాలను తగ్గించవచ్చు. గోరువెచ్చని నీటిలో వాము పౌడర్ కలిపి తాగడం వల్ల నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే తిమ్మిర్లు, కడుపు నొప్పిని దూరం చేస్తుంది. పొత్తి కడుపు తగ్గుతుంది. ఇలా క్రమంగా వాము వాటర్ తాగుతూ ఉంటే.. బరువు కూడా తగ్గుతారు. ఇందుకోసం వాము పొడి లేదంటే, వాముని నేరుగా కూడా తీసుకోవచ్చు.
ట్యాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది. ఎసిడిటీతో బాధ పడుతున్న వాళ్లు టీ స్పూన్, జీలకర్ర వేసి మరిగించిన నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ మిశ్రమం తాగడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలిచ్చే తల్లులకు, గర్భం దాల్చిన మహిళలకు వాము మేలు చేస్తుంది.
వాములో ఉండే నియాసిన్ గుండె సంబంధిత సమస్యలు రాకుండా తోడ్పడుతుంది. వాములో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పికి చెక్ పెట్టడంలో తోడ్పడతాయి.
