9-16 యేళ్ళలోపు ఈ టీకా తీసుకుంటే కొన్ని క్యాన్సర్లు రావని తెలుసా?

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అని ఒక ఇంగ్లీష్ సామెత. సమస్య వచ్చాక బాధపడటం కంటే రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. క్యాన్సర్ ని కూడా కొన్ని రకాల ఆహారపు అలవాట్లతోను, మంచి జీవన శైలితోనూ చాలా వరకు నియంత్రించవచ్చు. అలాగే సర్వికల్ క్యాన్సర్ నియంత్రించటానికి ఒక వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి. ఈ వైరస్ ని నియంత్రించాలంటే హెచ్.పీ.వి వ్యాక్సిన్ చేయించుకోవాలి.

  • ఈ టీకా తీసుకోవడం వలన సర్వికల్ క్యాన్సర్(గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్) రాకుండా కాపాడుకోవచ్చు.
  •  ఈ వ్యాక్సిన్ నోరు, గొంతు, మలద్వార, పురుషాంగ క్యాన్సర్ల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది.
  • ఇది పేరుకే సర్వికల్ క్యాన్సర్ కానీ స్త్రీ పురుషులకు దీనిలోనే వేరువేరు వ్యాక్సిన్లు ఉంటాయి.
  • ఈ వ్యాక్సిన్ తొమ్మిది నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు ఇప్పించాలి.
  • లైంగిక క్రీడలో పాల్గొనని పక్షంలో 26 యేళ్ళ వయసు వరకు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.