క్యాన్సర్ వ్యాధి బారిన పడితే కనిపించే లక్షణాలివే.. ఇలా జరిగితే జాగ్రత్త పడాల్సిందే!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వాళ్లలో ఎక్కువగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయ్. అజీర్ణం లేదా గుండెల్లో మంట సమస్య చాలామందిని వేధిస్తున్నా రాత్రుళ్లు ఎక్కువ చెమట పడుతున్నా గొంతు మరియు ముక్కు నుంచి రక్తం కారుతున్నా ఈ లక్షణాలు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు అని చెప్పవచ్చు.

పదేపదే దగ్గు వేధిస్తుండటం, ఊపిరి ఆడకపోవడం కూడా క్యాన్సర్ లక్షణాలు అని చెప్పవచ్చు. ఆకలి లేకపోవడం మరియు అనుకోకుండా బరువు తగ్గడం కూడా ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. మింగడంలో ఇబ్బంది పడడం మరియు రక్త వాంతులవ్వడం కూడా క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలుగా ఉంటాయి. మూత్రంలో రక్తం, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడడం కూడా క్యాన్సర్ లక్షణాలుగా ఉంటాయి.

క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటి కాగా శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్‌ క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

విపరీతమైన అలసట, ఆకలి తగ్గడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం, రొమ్ము లేదా శరీరంలోని ఇతర భాగంలో గట్టిపడటం లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదిస్తే మంచిది. క్యాన్సర్‌ కణాల వృద్ధి కారణంగా.. వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.