క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని.. ఆర్థిక సహాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్!

జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో అంతే గొప్ప మనిషి అని అందరికీ తెలిసిందే. తన ధ్యాస సినిమాల మీదే కాకుండా తన అభిమానుల మీద కూడా ఉంటుంది. ఏ ఈవెంట్ అయినా సరే అభిమానులు అందరూ బాగుండాలి జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పుడూ జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. తన ఫ్యాన్స్ కి ఏమైనా కష్టం వచ్చినా ముందుగా వెళ్లి తన వంతు సాయం చేస్తారు జూనియర్ ఎన్టీఆర్.

అయితే రెండు నెలల క్రితం దేవర విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. కౌశిక్ అనే ఒక యువకుడు బోన్ క్యాన్సర్ తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తను ఎన్టీఆర్ వీరాభిమానినని, దేవర సినిమా చూసేవరకు తను బతకాలి అని కోరుకున్నాడు. అయితే ఆ వీడియో జూనియర్ ఎన్టీఆర్ వరకు వెళ్లగా జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్ కు వీడియో కాల్ చేసి ధైర్యం ఇచ్చారు.

కొన్ని రోజుల తర్వాత మరల కౌశిక్ తల్లిదండ్రులు చికిత్సకు సాయం కోసం అడగగా జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. చెన్నైలో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కౌశిక్ కు ట్రీట్మెంట్ బిల్లు కట్టి ఆర్థిక సాయం చేశారు ఎన్టీఆర్. కౌశిక్ కోలుకొని డిస్చార్జ్ అవ్వబోతున్నాడు. ఆ తల్లిదండ్రులు జూనియర్ ఎన్టీఆర్ కి ఎంతో రుణపడి ఉంటామంటూ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సంఘటనే కాకుండా మరెన్నో సంఘటనలలో జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సాయం తన అభిమానులకు చేస్తూనే ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే దేవర సినిమా విడుదల తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది ప్రశాంట్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా దేవర 2 కూడా రాబోతుంది
వరుసగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.