టీని ఎక్కువగా మరిగించి తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

మనలో చాలామంది టీని ఎంతో ఇష్టంగా తాగుతారనే సంగతి తెలిసిందే. టీ తాగడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అతిగా ఉడకబెట్టిన టీని నాలుగు కప్పుల కంటే ఎక్కువగా తాగకూడదు. ఈ విధంగా చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎక్కువగా టీ తాగితే కడుపునొప్పి సమస్య సైతం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

ఎవరైతే టీ ఎక్కువగా తాగుతారో వాళ్లను మలబద్ధకం సమస్య కూడా వేధించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. అతిగా టీ తాగడం వల్ల తలనొప్పి, నిద్రలేమి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా టీ తాగడం వల్ల గుండెల్లో మంట, ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయి. టీ ఎక్కువగా తాగేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. తక్కువ మొత్తం ఖరీదుతోనే టీ దొరుకుతుందనే సంగతి తెలిసిందే.

టీ తాగే వాళ్లలో హృద్రోగ ముప్పు తాగని వారికంటే 45 శాతం తక్కువగా ఉంటుంది. టీలో ఉండే కెఫిన్ గుండెల్లో మంట, ఎసిడిటీకి కారణం అయ్యే అవకాశాలు ఉంటాయి. పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచే సామర్థ్యం టీకి ఉంటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. టీ ఎక్కువగా తాగితే మలబద్ధకం సమస్య వేధించే అవకాశాలు ఉంటాయి.

ఎక్కువ మొత్తంలో టీ తీసుకుంటే తలనొప్పి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రోజువారీ అవసరానికి మించి టీ తాగేవారిలో రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మెలటోనిన్ అనే హార్మోన్ చర్యను టీ అడ్డుకునే అవకాశాలు అయితే ఉంటాయి. గర్భధారణ సమయంలో టీ ఎక్కువగా తల్లి, బిడ్డ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. రోజుకు 2 నుంచి 3 కప్పుల టీ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.