టాటా స్టీల్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. టాటా స్టీల్ యాస్పైరింగ్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. జూన్ 11వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపరేషన్స్, మెయిన్‌టనెన్స్, ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ విభాగాలలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు పని చేయాల్సి ఉంటుంది.
బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్) పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం జూన్ 1వ తేదీ సమయానికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. tatasteel.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొదటి ఫేజ్‌లో ఆన్‌లైన్ టెస్ట్ ఉండగా రెండో ఫేజ్ లో ఇంటర్వ్యూ ఉంటుంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుని ఎంపికవుతారో వాళ్లకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు 30,000 రూపాయల స్టైఫండ్ లభించడంతో పాటు ఏటా 2.50 లక్షల రూపాయల చొప్పున మెడిక్లెయిమ్ సౌకర్యం లభిస్తుంది. అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపికైన తర్వాత ఏకంగా రూ. 7 లక్షల ప్యాకేజీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకుఎంపికైన వాళ్లు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.