నిరుద్యోగులకు రైల్వే శాఖ తీపికబురు.. భారీ వేతనంతో 2400 ఉద్యోగ ఖాళీలు!

ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేయడం ద్వారా రైల్వే శాఖ నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్స్ కలిగిస్తోంది. పదో తరగతి, ఐటీఐ అర్హతతో రైల్వే శాఖలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. rrccr.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పదో తరగతి, ఐటీఐ అర్హతతో సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ కావడం గమనార్హం.

ఆగష్టు నెల 28వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా మొత్తం2409 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ట్రేడ్‌లో ఐటీఐ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మెరిట్ జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అప్రెంటిస్ 2023-24 ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు, డేటాఫ్ బర్త్, ఇమెయిల్ అడ్రస్ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 7000 రూపాయల స్టైఫండ్ లభించనుందని సమాచారం అందుతోంది.