రాతపరీక్ష లేకుండా సెయిల్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.లక్ష వేతనంతో?

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుభవం ఉన్న ఉద్యోగులకు మరో తీపికబురు అందించింది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతుండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. sail.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

69 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు లక్ష రూపాయల రేంజ్ లో వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్లబ్, సెయిల్-కొలీరీస్ డివిజన్, చస్నాలా, ధన్‌బాద్, జార్ఖండ్- 828135 అడ్రస్ కు ఈ నెల 16వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉండగా అభ్యర్థులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

సెయిల్ లో ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై ఫోకస్ పెడితే సులువుగా కెరీర్ పరంగా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే ఛాన్స్ అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.