ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 41,822 ఆర్మీ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న సీట్లలో ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైందని సమాచారం. త్వరలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. సూపర్‌వైజర్, డ్రాట్స్‌మన్, స్టోర్ కీపర్, ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో మేట్ ఉద్యోగ ఖాళీలు 27920 ఉండగా మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 11316 ఉన్నాయి. స్టోర్ కీపర్ ఉద్యోగ ఖాళీలు 2026 ఉండగా డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగ ఖాళీలు సూపర్‌వైజర్ (బ్యారాక్ & స్టోర్) ఉద్యోగ ఖాళీలు 534, బ్యారక్ & స్టోర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 120, ఆర్కిటెక్ట్ కేడర్ గ్రూప్ ఉద్యోగ ఖాళీలు 44 ఉన్నాయి. రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. పది, ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల అర్హతకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుసగా విడుదలవుతున్న జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరుగుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటేమంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకుంటే మంచిది.