మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పండుగలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే తీపికబురు అందించింది. ఈ పండుగ సమయంలో ఏకంగా లక్ష ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఫ్లిప్ కార్ట్ అడుగులు వేయడం గమనార్హం. బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు భారీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
ప్రత్యక్ష, పరోక్ష విభాగంలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు ఇది అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. అయితే ఈ ఉద్యోగ ఖాళీలలో ఎక్కువ ఉద్యోగ ఖాళీలు తాత్కాలిక ఉద్యోగ ఖాళీలుగా ఉంటాయి. ప్రస్తుతం ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నవాళ్లకు మాత్రం ఈ ఉద్యోగ ఖాళీలు బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్ తో పాటు పండుగ సమయంలో మరికొన్ని సంస్థలు సైతం భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అదే సమయంలో డిస్కౌంట్లలో వస్తువులను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు పండుగల సమయంలో షాపింగ్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఫ్లిప్ కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ నిరుద్యోగులకు కొంతమేర బెనిఫిట్ కలిగిస్తోంది. కొంతకాలం పాటు ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు ఈ ఉద్యోగం బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.