ప్రస్తుత కాలంలో ప్రజలు జీవనం సాగించడానికి డబ్బు చాలా అవసరం. అందువల్ల ప్రజలు కష్టపడి పనిచేసే డబ్బు సంపాదించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆర్థిక సమస్యలు తలెత్తకుండా డబ్బుని పొదుపు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో బ్యాంకులు , పోస్ట్ ఆఫీస్ లు అందిస్తున్న వివిధ స్కీమ్స్ లో డబ్బు పొదుపు చేస్తూ ఉంటారు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో అనే పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో ఒక ఖాతా తీసుకుని చిన్న మొత్తాల్లో పొదుపు ప్రారంభించవచ్చు. వీటిలో పొదుపు చేయడం ద్వారా మన పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.
ఇదిలా ఉండగా పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ స్కీమ్ పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయ పనులు భారాన్ని తగ్గించడమే కాకుండా అధికంగా ఏడు శాతం రాబడిని కూడా పొందవచ్చు. పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ స్కీమ్ మెట్యురిటీ కాలం 5 సంవత్సరాలు. ఈ స్కీమ్ లో వివిధ మెచ్యూరిటీ కాలాల ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
టర్మ్ డిపాజిట్ పై లభించే వడ్డీ :
వివిధ కాల పరిమితుల ప్రకారం, ఈ టర్మ్ డిపాజిట్ మీద 6.6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సర కాల డిపాజిట్ మీద 6.6 శాతం వడ్డీ, రెండు సంవత్సరాల డిపాజిట్ మీద 6.8 శాతం వడ్డీ, మూడు సంవత్సరాల డిపాజిట్ మీద 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల కాలానికి మీరు డిపాజిట్ చేస్తే 7 శాతం వడ్డీని పొందవచ్చు.
ఏ కాల డిపాజిట్పై ఆదాయ పన్ను క్లెయిమ్ చేసుకోవచ్చు?
పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు 1 నుండి 5 సంవత్సరాల మెచ్యూరిటీతో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆదాయపు పన్ను ప్రయోజనం పొందాలంటే ఐదు సంవత్సరాల పాటు తరుణ్ డిపాజిట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ మీద మాత్రమే మీకు ఆదాయ పన్ను ప్రయోజనం లభిస్తుంది, దీనిని మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోగలరు.