Balineni Srinivas Reddy: వైయస్ కుటుంబం అంటే జగన్ ఒక్కడే కాదు… చెవిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన బాలినేని!

Balineni Srinivas Reddy: వైకాపా పార్టీలో మంత్రిగా కొనసాగిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఈ పార్టీకి దూరంగా ఉంటూ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల తెరపైకి వచ్చిన సెకీ విద్యుత్ ఒప్పందం గురించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి కాడ జగన్మోహన్ రెడ్డి అందరిని సంతకాలు చేయమని కోరారు అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆ సమయంలో సంతకాలు ఎందుకు చేయించుకుంటున్నారు దీంట్లో ఏదో మతలబు ఉంది అని భావించి తాను సంతకం పెట్టలేదని ఈయన తెలిపారు. ఇలా ఈ ఒప్పందం పట్ల బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి టిడిపిలో ఎమ్మెల్సీ పదవిని ఆశించే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

ఆయన ఎమ్మెల్సీ పదవిని కోరుకుంటున్నారని అందుకోసం ఇప్పటికే 9 కోట్ల రూపాయలు చంద్రబాబునాయుడుకి ఇచ్చారంటూ కూడా చెవిరెడ్డి చెప్పడంతో బాలినేని కౌంటర్ ఇచ్చారు. తాను విలువలు లేని రాజకీయాలు చేయనని తెలిపారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు కూడా నేను వదులుకున్నాను. చంద్రబాబు పవన్ మెప్పు కోసం నేను మాట్లాడుతున్నానని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎవరి మెప్పు కోసమో నేను పని చేయడం లేదు అనే విషయాన్ని చెవిరెడ్డి గుర్తుంచుకోవాలని తెలిపారు.

వీరిని తిడితేనే పదవులు ఇస్తాము అనే సాంప్రదాయాన్ని ఎవరు కనిపెట్టారు ఎవరు కొనసాగిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు రాజకీయ బిక్ష పెట్టింది జగన్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్ మాత్రమే కాదు వైఎస్ షర్మిలమ్మ వైయస్ విజయమ్మ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కాదా అంటూ ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.