ప్రస్తుత కాలంలో పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అన్ని వయస్సుల వారికి ప్రయోజనం చేకూరే విధంగా పోస్టాఫీస్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ లో 7.4 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
గరిష్టంగా ఈ స్కీమ్ లో 9 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో భాగంగా జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. 5 సంవత్సరాల కాలపరిమితితో ఈ స్కీమ్ అమలవుతోంది. జాయింట్ అకౌంట్ కు సైతం 5 సంవత్సరాలు కాల పరిమితి కాగా 15 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఏదైనా కారణాల వల్ల మధ్యలోనే అకౌంట్ ను క్లోజ్ చేస్తే పొందే వడ్డీ మొత్తంలో కొంత మొత్తం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత ఏకంగా ఏకంగా దాదాపుగా ఐదున్నర లక్షల రూపాయల వడ్డీ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పోస్టాఫీస్ లో నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉండగా ఈ స్కీమ్ లో వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది.
పోస్టాఫీస్ స్కీమ్స్ లో దాదాపుగా అన్ని పథకాలకు వడ్డీ రేటు ఒకే విధంగా ఉండటం కొసమెరుపు. ఈ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహనను ఏర్పరచుకుని తెలివిగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.