డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో అడుగుపెడుతూనే రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న ని హీరోయిన్ గా పెట్టి యానిమల్ అనే సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా నిర్మాతల కి కాసుల వర్షం కురిపించింది. గత ఏడాది విడుదలై మంచి సక్సెస్ అందుకున్న సినిమాలలో యానిమల్ ఒకటి. అయితే ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ అదే రేంజ్ లో విమర్శలు సైతం ఎదుర్కోవటం గమనార్హం.
తీవ్రహింస పలు సన్నివేశాలలో స్త్రీని తక్కువగా చూపించడం పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వటం సమాజానికి ప్రమాదకరం అంటూ కొందరు నేరుగానే స్పందించారు. ఈ సినిమాలో నటించినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ ఒక నటుడు ఇచ్చిన స్టేట్మెంట్ అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి రణబీర్ కపూర్ గోవా వేదికగా జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా స్పందించారు.
ఈ సినిమా విషయంలో అందరి అభిప్రాయాలతోనూ నేను ఏకీభవిస్తున్నాను, ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావటం మా బాధ్యత దానితోపాటు కొత్తదనాన్ని కూడా ప్రోత్సహించాలి. నటీనటులందరూ విభిన్నమైన పాత్రలు పోషించినప్పుడే కెరియర్ బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే వేదికపై బాలీవుడ్ నట దిగ్గజం రాజ్ కపూర్ గురించి కూడా మాట్లాడుతూ నాటితరం నట దిగ్గజాలని నేటి తరానికి తెలిసేలా చేసే బాధ్యత అందరి పైన ఉంది.
అందుకే డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించి భారతదేశమంతా రాజ్ కపూర్ సినిమాలని ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించాడు. నాటితరం నటుల గురించి నేటితరం వారికి అసలు తెలియదని, తాను అలియా ని మొదటిసారి కలిసినప్పుడు బాలీవుడ్ నట దిగ్గజం కిషోర్ కుమార్ గురించి తెలియదని చెప్పిందని చెప్పుకొచ్చారు. అందుకే అలాంటి వాళ్ల గురించి నేటి తరం వాళ్లకి తెలియాలంటే వారి సినిమా ల గురించి ఫీలిం ఫెస్టివల్ నిర్వహించాలన్నారు.