మనలో చాలామంది పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతి నెలా ఆదాయం పొందాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా కొన్ని పోస్టాఫీస్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొన్ని పథకాలు దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే అవకాశాలు అయితే ఉంటాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా ప్రతి నెలా 9,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
పోస్టాఫీస్ స్కీమ్ లో జాయింట్ అకౌంట్ ద్వారా ఏకంగా 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ కు మెచ్యూరిటీ గడువు ఐదు సంవత్సరాలుగా ఉండగా ఈ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తంలో మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 9,250 రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది.
పది సంవత్సరాల వయస్సు దాటిన పిల్లల పేర్లపై ఈ స్కీమ్ కు సంబంధించిన అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఎలాంటి రిస్క్ ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు. ఎలాంటి ప్రమాదం లేకుండా డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ ద్వారా దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే ఛాన్స్ అయితే ఉండదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ స్కీమ్ కు సంబంధించి హామీ ఉంటుంది. బ్యాంకులలో ల్లేదా పోస్టాఫీస్ లలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులలో 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. డబ్బులను ఇన్వెస్ట్ చేసేవాళ్లు పూర్తి విషయాలను తెలుసుకుని పెట్టుబడులు పెడితే మంచిదని చెప్పవచ్చు.