బస్సు ప్రమాదంలో గాయపడ్డ కాంతారా చిత్ర యూనిట్.. సినిమా రిలీజ్ పై ప్రభావం చూపిస్తుందా!

రిషబ్ శెట్టి తాను హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా కాంతారా. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఏమిటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ వన్ సినిమా తీస్తున్నాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గానే రిషబ్ శెట్టి ఈ సినిమా గురించి మాట్లాడుతూ కాంతారాకి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ వన్ చిత్రం రాబోతుంది. ఈ సినిమా 2025 అక్టోబర్ 2 తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలిపాడు.

అయితే అనుకోని విధంగా ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న ఒక బస్సు కి యాక్సిడెంట్ అయింది. షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్తున్న మినీ బస్సు బోల్తా పడింది. కర్ణాటక రాష్ట్రం కొల్లూరు సమీపంలోనే జట్కల్ దగ్గర బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు. కాగా వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని హాస్పిటల్కి తీసుకువెళ్లే చికిత్స అందిస్తున్నారు. వీరికి సంబంధించిన హెల్త్ అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. కాంతారా సినిమా అఖండ విజయం సాధించింది.

దాంతో ఇప్పుడు ఆ సినిమాకి ఫ్రీక్వల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. షూటింగ్ కూడా శరవేగంగా చేస్తున్నాడు రిషబ్ శెట్టి. ఇలాంటి సమయంలో ఇలాంటి ఆక్సిడెంట్ జరగడం నిజంగా బాధాకరం. ఇక కాంతారా చాప్టర్ 1 కథ విషయానికి వస్తే కాంతారా సినిమాకి ముందు ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపిస్తారు. పిరియాడికల్ మూవీ గా రూపొందుతున్న ఈ ఫ్రీక్వెల్ కి సంబంధించిన విశేషాలు సినిమాపై మరింత క్యూరియాసిటీని కలగజేస్తున్నాయి.

దక్షిణ భారత చరిత్రలో స్వర్ణ యుగంగా పేరొందిన కదంబ రాజ్య నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందంట. అంతా సవ్యంగా సాగితే రిషబ్ శెట్టి చెప్పినట్లుగానే 2025 అక్టోబర్ లో సినిమా రిలీజ్ అయ్యేదేమో కానీ ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ జరగటం అనేది సినిమాపై ప్రభావం చూపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది దీనిపై రిషబ్ శెట్టి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో వేచి చూడాలి.