స్టార్ నటుడు మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు అయినా గల్లా అశోక్ హీరో సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన సంగతి తెలిసిందే. తన రెండో సినిమాగా దేవకి నందన వసుదేవ సినిమా చేశారు అశోక్. ఈ సినిమాకి కథని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందించారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. అలాగే మాటలు సాయి మాధవ్ బుర్రా అందించారు. ప్రశాంత్ వర్మ కథ అందించడం, పురాణాలతో ముడిపడిన కథ కావటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఈ సినిమా మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మినిమం ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయలేక ఓపెనింగ్స్ కూడా రాబట్టలేని సిట్యుయేషన్ లో సినిమా రిలీజ్ అయింది. డిస్ట్రిబ్యూటర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో 40 లక్షలు రాబట్టటం కష్టమైపోయింది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే ఆదివారం చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ చేశారు.
ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన ఈ సినిమా డిజార్డర్ కావడంతో ఇప్పుడు అందరూ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కోసం 14 కోట్లు దాకా పెట్టారని, జీరో షేర్ రావడంతో మొత్తం పోయిందని అంటున్నారు. హీరో స్థాయికి తగ్గ కధ కాకపోవటం, కంటెంట్ వీక్ గా ఉండడం దానికి తోడు అశోక్ నటనలో పరిపక్వత లేకపోవడం సినిమా డిజాస్టర్ కి కారణాలు అంటున్నారు సినీ విమర్శకులు. ఈ సినిమా ఓటీటీ సాటిలైట్ అగ్రిమెంట్స్ కూడా చేయటం కష్టమే అని చెప్తున్నారు.
ఈ సినిమాకి ఐదు కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే 5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే సినిమా మీద పెట్టిన సొమ్ము తిరిగి వచ్చేలా కనిపించడం లేదు. గల్లా అశోక్ మొదటి సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాకపోవటం విశేషం. ఇక ఇప్పుడు అతను తన మూడవ సినిమాగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేయబోతున్నాడు. ఆ సినిమా అయినా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.