ఏఆర్ రెహమాన్ అద్భుతమైన వ్యక్తి.. భర్తని వెనకేసుకొస్తున్న సైరా భాను!

ఆస్కార్ అవార్డు గ్రహీత, వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ తమ 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఆయన భార్య సైరాభాను తో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ కూడా పెట్టారు. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ వయసులో విడాకులు అవసరమా అంటూ సోషల్ మీడియాలో సైతం పెద్దగా చర్చ జరుగుతోంది.

అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ బ్యాండ్ లో భాగమైన మహిళా సంగీత విధ్వంసరాలు మోహానిదే తో ఆయనకి అక్రమ సంబంధం ఉందని పుకార్లు షికారులు చేస్తున్నాయి. అయితే దీనిపై ఏఆర్ రెహమాన్ భార్య సైరాభాను స్పందించింది. ఈ మేరకు సైరా బాను న్యాయవాది వందన షా ఓ వాయిస్ క్లిప్ ని విడుదల చేశారు. నేను సైరా బాను మాట్లాడుతున్నాను ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నాను, గత కొన్ని నెలలుగా శారీరకంగా నా పరిస్థితి ఏమి బాగోలేదు అందుకే రెహమాన్ నుంచి విడాకులు కోరుకుంటున్నాను.

ఇదే మా విడాకులకు కారణం యూట్యూబ్ కి,యావత్ యూట్యూబర్స్ కి నేను చేసే విజ్ఞప్తి ఒకటే దయచేసి రెహమాన్ గురించి చెడుగా ప్రచారం చేయవద్దు. నా ఆరోగ్యం వల్లే చెన్నై నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు కానీ మీడియా సైరా ఎక్కడుందంటూ వెతుకుతున్నారు. నేను చికిత్స తీసుకునేందుకు ముంబై వచ్చాను, నా పిల్లలను కానీ రెహమాన్ ను కానీ ఎవరినీ నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు.

రెహమాన్ ఒక అద్భుతమైన వ్యక్తి అతడిని అలా వదిలేయండి, నేను అతని అంతగా ప్రేమించానో చెప్పటానికి ఇదే నిదర్శనం. అతను కూడా నన్ను అంతగానే ప్రేమించాడు దయచేసి అతడిని బజారుకీడ్చవద్దు. త్వరలోనే చికిత్స పూర్తి చేసుకుని చెన్నై వస్తాను అంటూ ఆ వాయిస్ నోట్లో వివరించారు. ఇకనైనా సోషల్ మీడియా లో రెహమాన్ ని ట్రోల్స్ గురి చేయకుండా ఉంటే బాగుంటుంది అంటున్నారు ఏ ఆర్ రెహమాన్ అభిమానులు.