Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూనే ఉండగా వారికి తమదైన శైలిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెబుతోంది. అయితే ప్రస్తుతం అదానీ వ్యవహారం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.
అదానీ నుంచి రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలు సి ఎస్ ఆర్ ఫండ్స్ కింద సిల్క్ యూనివర్సిటీకి వందకోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు. అయితే ఈ విషయంపై బిఆర్ఎస్ పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నారు. ఇక ఈ విషయం పేరు రేవంత్ రెడ్డి వారికి తమదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. అదానీ సమస్థ కు తెలంగాణలో భారీ స్థాయిలో ప్రాజెక్టులను ఇచ్చి బిఆర్ఎస్ కమిషన్లను మెక్కింది.
నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సిల్క్ యూనివర్సిటీ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చాను. మా కుటుంబం ఏమి ఆ నిధులను కొట్టేయలేదు. గతంలో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా అదానీకీ వంగి వంగి మరి నమస్కారాలు పెట్టారు. బిఆర్ఎస్ నాయకులకు గత ఏడాది అధికారం పోయి డిపాజిట్లు కూడా పోయాయి ఇప్పుడు వారికి మెదడు కూడా పోయిందని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదానీ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిల్క్ యూనివర్సిటీ కోసం తీసుకున్న 100 కోట్ల విరాళాన్ని కూడా వెనక్కి ఇవ్వడానికి తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని కొంతమంది విమర్శిస్తున్నారని అనవసరమైన విషయాలలోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగి ఇబ్బందులు పెట్టను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.