ప్రపంచం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ తన 29 సంవత్సరాల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ ని అందరూ ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. నిజా నిజాలు ఏమిటో తెలియకుండా నోటికి వచ్చిన మేటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఏఆర్ రెహమాన్ స్పందించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి లీగల్ నోటీసులు జారీ చేశారు. కుటుంబం గురించి తప్పుడు వార్తలు,పోస్టులు తొలగించాలని డిమాండ్ చేశారు.
24 గంటల్లో తనపై జరిగిన దుష్ప్రచారానికి సంబంధించిన కంటెంట్ ఏ రూపంలో ఉన్నా మొత్తం తొలగించకపోతే భారతీయ న్యాయ సంహితలోని 356 సెక్షన్ కింద పరువు నష్టం దాబా దాఖలు చేస్తామని హెచ్చరిస్తూ ఏ ఆర్ రెహమాన్ తరఫు న్యాయవాది బహిరంగ నోటీసులు విడుదల చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు యూట్యూబ్ చానల్స్, ఫేస్బుక్ పేజ్ మేనేజర్ తదితరులకి లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.
దీని పట్ల ఏ ఆర్ రెహమాన్ అభిమానులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలకి ప్రైవేట్ స్పేస్ ఉంటుందని కానీ కొందరు అది అర్థం చేసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలాంటి వారికి ఏ ఆర్ రెహమాన్ సరిగా బుద్ధి చెప్పాడని అంటున్నారు. అదే సమయంలో ఏఆర్ రెహమాన్ భార్య కూడా స్పందించింది. తన భర్త చాలా మంచివాడని, తన భర్తకి మోహిని డే తో ఉన్న రిలేషన్షిప్ అబద్ధమని, నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని తెలిపింది.
వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించవద్దని, తన అనారోగ్య కారణం వలనే ఏ ఆర్ రెహమాన్ కి దూరంగా ఉన్నానని, ఏఆర్ రెహమాన్ చాలా అద్భుతమైన వ్యక్తి అని భర్తని వెనకేసుకుని వచ్చింది సైరా బాను. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చెయ్యొద్దు అంటూ ఒక ఆడియో క్లిప్ ని కూడా విడుదల చేశారు. ఈ దంపతులు సోషల్ మీడియా కి సరైన బుద్ధి చెప్పారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏ ఆర్ రెహమాన్ ఫ్యాన్స్.