రైతన్నలకు శుభవార్త.. అడవి పందులు, కోతుల నుండి పంటను కాపాడే మెషిన్..?

మన దేశానికి రైతు వెన్నెముక లాంటివాడు. అయితే పంట పండించడానికి రైతులు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. పొలంలో పంట వేసిన తర్వాత ఆ పంటను చీడపురుగులు నుండి జంతువుల నుండి కాపాడుతూ ఉండాలి. ముఖ్యంగా పొలంలో అడవి పందులు ఇతర జంతువుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. అయితే రైతులను వీటి బెడద నుంచి కాపాడేందుకు తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ కొత్త మెషిన్ తీసుకొచ్చింది. ఈ యూనివర్సిటీలో అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం ఈ యంత్రాన్ని తయారు చేసింది.

‘జీవ ఆర్తనాద’ అనే ఈ సరికొత్త మెషిన్ 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలోని పంటలను అడవి పందులు, కోతుల నుంచి కాపాడుతుంది. ఈ మెషిన్ ఒక విధమైన సౌండ్స్, వివిధ రకాల జంతువుల అరుపులను గట్టిగా ప్లే చేస్తుంది. ఆ శబ్దాలను విని అడవి పందులు, కోతులు పంట పొలాల వైపు రాకుండా దూరంగా ఉంటాయి. జీవ ఆర్తనాద యంత్రంలో ఒక స్పీకర్, మదర్ బోర్డు, బ్యాటరీ ఉంటాయి. ఒక బాక్స్ లాగా ఉండే దీనిలో క్రూర జంతువుల అరుపులు వినిపిస్తాయి. అంటే లో పులులు,అడవి కుక్కలు, చిరుత పులి వంటి జంతువులు అరుపులు వినిపిస్తాయి.

ఈ మిషన్ సోలార్ ప్యానెల్, బ్యాటరీతో చేస్తుంది. రైతులు ఈ మెషిన్ ని పొలంలో ఒక స్టాండ్పై పంటకు అడుగు దూరంలో కాస్త ఎత్తులో అమర్చాలి. రాత్రి సమయంలో అడవి పందుల, కోతులు,ఇతర జంతువుల నుంచి ఇది పంటను రక్షిస్తుంది. అలాగే ఈ ఆర్తనాద యంత్రాన్ని స్మార్ట్ఫోన్తో కనెక్ట్ చేసి ఇంటి నుంచే ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. దీని ధర రూ.26 వేలు అని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. అధికారులు ఈ యంత్రాన్ని పరీక్షించారు. ఈ టెస్ట్ లో మెషిన్ 80-90 శాతం పంట నష్టాన్ని తగ్గించింది. దీనిని సొంతం చేసుకోవాలనుకునే రైతులు 9490806018 నంబర్కు ఫోన్ చేసి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.