TG: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైంది అంటూ బిఆర్ఎస్ నాయకులు తరచు కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విమర్శలు అన్నింటిని తిప్పికొడుతూ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నారు అయితే తాజాగా క్యాబినెట్ మీటింగ్ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల గురించి గుడ్ న్యూస్ తెలిపారు.
ఆరు గ్యారెంటీలలో భాగంగా రైతులకు ఇస్తామని ప్రకటించిన రైతు భరోసా డబ్బు గురించి ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో సర్కారుపై విమర్శలు చేశాయి అయితే ఆ విమర్శలకు చెక్ పెడుతూ రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే రైతు భరోసా అందించబోతున్నట్లు తెలిపారు. అయితే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
ఈ పథకం కింద ఎకరాకు 12 వేల రూపాయలు చొప్పున నిధులు ఇవ్వబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలియచేశారు. అలాగే ఎవరైతే తమ భూములలో పంట వేయకుండా వెంచర్లు వేసి వాటిని రియల్ ఎస్టేట్ కింద మార్చి ఉంటారో అలాంటి వారికి రైతు భరోసా నగదు జమ కాదని రేవంత్ తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు.
ఆర్థిక వెసులు బాటును బట్టి రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. భూమి లేని రైతులకు కూడా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలియజేశారు. జనవరి 26, 2025 పథకాలన్నింటిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ తెలిపారు.