సాధారణంగా డిఫెన్స్ మోడ్ లోనే రాజకీయాలు చేస్తున్నట్లు కనిపించే జగన్.. గత కొన్ని రోజులుగా దాన్ని కొద్ది కొద్దిగా పక్కన పెట్టుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా గుడివాడ వచ్చేసరికి దాన్ని పూర్తిగా పక్కనపెట్టినట్లు కనిపించారు. ఫలితంగా ప్రత్యర్థులపై ఎఫెన్స్ వెళ్లి ఫైర్ అయ్యారు! ఇలా రొటీన్ కి భిన్నంగా సాగిన జగన్ స్పీచ్ ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.
ఒకపక్క కుప్పంలో చంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లాలో పవన్ మైకులందుకుని దూకుడు పెంచుతున్న తరుణంలో.. జగన్ తన సహజ శైలికి భిన్నంగా స్పందించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం అన్నరీతిలో గుడివాడలో బేస్ పెంచారు. ఈ సందర్భంగా ఒక పక్క చంద్రబాబు గాలి తీసేస్తూ.. మరోపక్క పవన్ ని ఎద్దేవా చేశారు.
అవును.. తాజాగా గుడివాడలో మైకందుకున్న జగన్… 175 సీట్లలో 175 సీట్లకూ పోటీ కూడా పెట్టలేని చంద్రబాబు మన ప్రత్యర్థా అంటూ ప్రధాన ప్రతిపక్షాన్ని లైట్ చేసేశారు. ఒక్క డైలాగ్ తో చంద్రబాబు పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు!
ఇదే సమయంలో బాబు పొలిటికల్ కెరీర్ పై స్పందించిన ముఖ్యమంత్రి జగన్… మూడు సార్లు సీఎం అయి కూడా తన సొంత నియోజకవర్గం కుప్పానికి ఏమీ చేయలేని పెదమనిషి మరో చాన్స్ అంటున్నాడని, ఈసారి గెలిస్తే అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో కుప్పాన్ని బంగారం చేస్తానని అంటున్నాడని ఎద్దేవా చేశారు.
అనంతరం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన జగన్.. తన వ్యాన్ ని చూసుకుని మురిసిపోతున్నాడు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అని సెటైర్లు వేశారు. రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వడమే టార్గెట్ గా పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. తన జీవితం మొత్తం చంద్రబాబుకు అంకితం అని చెప్పేసుకుంటూ.. ఆయన కోసమే తాను పుట్టినట్లుగా భావిస్తున్నారు ఈ ప్యాకేజి స్టార్ అని పవన్ తీవ్రంగా దెప్పి పొడిచారు జగన్.
ఈ సందర్భంగా మరింత డోస్ పెంచిన ఆయన… ఆ గజదొంగల పార్టీ నాయకుడు చంద్రబాబు, ఈ ప్యాకేజీ స్టార్ పవన్ తమకు ప్రత్యర్ధులు ఎలా అవుతారని జగన్ ప్రశ్నించారు. ఏది ఏమైనా… చంద్రబాబు 175 సీట్లకు పోటీ పెట్టలేడని, పవన్ ది చిచ్చా చితకా పార్టీ అంటూ జగన్ జనాలకు ఒక క్లారిటీ ఇస్తూ… ఫైనల్ గా ఎల్లో మీడియా అని చెప్పే ఛానల్స్ పై కూడా జగన్ తన మార్కు విమర్శలు చేశారు.