పుష్ప 2 కి వెళ్తే బేబీ జాన్ చూపించారు..ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!

కీర్తి సురేష్ తొలిసారిగా హిందీలో నటిస్తున్న సినిమా బేబీ జాన్. తమిళ చిత్రం తేరి కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ముందు నుంచి అనుమానించినట్లుగానే పుష్ప 2 నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది బేబీ జాన్. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన మూడో వారంలో కూడా కలెక్షన్స్ లో ఏమాత్రం జోరు తగ్గడం లేదు

ఇప్పటికే బాలీవుడ్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది ఈ సినిమా. అయితే డిసెంబర్ 25న విడుదలైన బేబీ జాన్ సినిమా మొదటిరోజు కలెక్షన్స్, పుష్ప 2, 21వ రోజు కలెక్షన్స్ తో సరితూగలేకపోయింది. బేబీ జాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 11.75 కోట్లు రాబట్టగలిగితే అదే రోజు పుష్ప 2 మూవీ 16 కోట్లు రాబట్టి హిందీలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

హిందీ మార్కెట్లో పుష్ప 2 మూవీ ఇప్పటికే 700 కోట్ల మార్క్ ని దాటి 800 కోట్ల వైపు పరుగుపెడుతోంది. బేబీ జాన్ సినిమా రిలీజ్ తర్వాత కూడా పుష్ప సినిమా చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో హౌస్ ఫుల్ షో నడుస్తుంది. ఇక బేబీ జాన్ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరటం కూడా కష్టమే అనిపిస్తుంది. అయితే తాజాగా ఒక థియేటర్ దగ్గర పుష్ప అభిమానులకి తీవ్ర నిరాశ ఎదురయింది.

పుష్ప సినిమా చూడటానికని టికెట్లు బుక్ చేసుకుని ధియేటర్ కి వెళ్లారు అయితే అక్కడ పుష్ప 2 కాకుండా బేబీ జాన్ సినిమా ప్రదర్శించడంతో ఫైర్ అయ్యారు అభిమానులు. అంతేకాకుండా థియేటర్ దగ్గర తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.