ప్రముఖ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 600 పీవో ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఎస్బీఐ అడుగులు వేస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2025 సంవత్సరం జనవరి 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖలలో పని చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుందని చెప్పవచ్చు. డిగ్రీ, బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 48480 రూపాయల నుంచి 85920 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉండనుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రిజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలను ఎస్బీఐ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది.