బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అర్జున్ కపూర్. ముఖ్యంగా సినిమాల కంటే ఇతను రిలేషన్షిప్ విషయాల్లోనే ఎక్కువగా వార్తలో నిలిచిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ కపూర్ రిలేషన్షిప్ గురించి స్పందించారు. ఈ మేరకు రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ.. నేను సింగిల్ గానే ఉన్నాను. రిలేషన్ లో లేను అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై అర్జున్ కపూర్ మాజీ స్నేహితురాలు బాలీవుడ్ నటి మలైకా అరోరా స్పందించారు. ఈ మేరకు మలైకా ఈ విషయం గురించి స్పందిస్తూ..
నేనొక ప్రైవేట్ పర్సన్ ని. నాకు సంబంధించిన ఏ విషయాన్నీ త్వరగా బయటపెట్టను. నా జీవితంలో కొన్ని అంశాల గురించి ఎక్కువగా వివరించకూడదు అనుకుంటాను. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేందుకు పబ్లిక్ ప్లాట్‌ఫామ్ ను ఎప్పుడూ ఎంచుకోను. ఇక రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అర్జున్ ఏది చెప్పినా అది తన వ్యక్తిగత అభిప్రాయం. దానిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు అని మలైకా తెలిపారు. ఈ సందర్భంగా మలైకా అరోరా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఈ ఏడాది తాను ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నానని ఆమె అన్నారు. తండ్రిని కోల్పోయి తాను ఎంతో బాధపడినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అలాగే తనకెంతో ఇష్టమైన ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టినందుకు ఆనందంగా ఉందని ఆమె అన్నారు.
కాగా సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో విడాకుల అనంతరం ఆమెకు అర్జున్ కపూర్ తో పరిచయం ఏర్పడింది. బాలీవుడ్ లో జరిగే ప్రతి కార్యక్రమానికి ఈ జంట కలిసి హాజరయ్యేవారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జోరుగా సాగింది. ఆయా వార్తలకు మరింత బలం చేకూర్చేలా పలు వెకేషన్లలో దిగిన ఫొటోలు ఈ జంట పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల వీరిద్దరూ విడిపోయారని అందుకే ఫ్యాషన్ కార్యక్రమాలకు కలిసి హాజరుకావడం లేదని టాక్. దీనిపై సింగమ్ అగైన్ ప్రమోషన్స్ లో అర్జున్ కపూర్ స్పందించారు.