Gukesh: గుకేశ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గుకేశ్ ఇటీవలే జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచి మరో చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. ఏకంగా ప్రపంచ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలవడంతో దేశవ్యాప్తంగా ఇతని పేరు మారుమోగిపోయింది. ప్రతి ఒక్కరూ ఇతనిని ప్రశంసించారు. ఇకపోతే తాజా గుకేశ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలను కలిశారు. అందులో భాగంగానే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిశారు గుకేశ్. రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. అనంతరం సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి కొంత సమయాన్ని కూడా గడిపారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను గుకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు. తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకర్షించిన గుకేశ్ ను రజనీకాంత్, శివ కార్తికేయన్ లు సన్మానించారు. చెన్నైలో రజనీకాంత్ నివాసానికి వెళ్లిన గుకేశ్ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. రజనీకాంత్ ఒక పుస్తకాన్ని బహుమతిగా అందించారు. ఈ ఫొటోలను పంచుకున్న గ్రాండ్ మాస్టర్.. సూపర్ స్టార్‌కు ధన్యవాదాలు చెప్పారు. మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు, నాతో సమయం గడిపినందుకు ధన్యవాదాలు సర్ అని పేర్కొన్నారు. అనంతరం హీరో శివ కార్తికేయన్ ను ఎన్నో కలిశారు. శివ కార్తికేయన్ గుకేశ్ కి ఒక వాచ్ ను బహుమతిగా అందించారు.
తన అభిమాన నటుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని గుకేశ్ అన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు నెటిజెన్స్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ గుకేశ్ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇది ఇలా ఉంటే హీరో కార్తికేయన్ విషయానికొస్తే ఇటీవలే అమరన్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. చాలా అద్భుతంగా నటించి భారీగా గుర్తింపును తెచ్చుకున్నారు శివ కార్తికేయన్.