కీర్తి సురేష్ పై రూమర్స్ క్రియేట్ చేస్తున్న నెటిజన్స్.. మహానటి ఎలా రియాక్ట్ అవుతుందో మరి!

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆపై కీర్తి సురేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు సినిమాల మీద సినిమాలు చేస్తూ మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ అయిపోయింది. రీసెంట్గా దసరా సినిమాతో మళ్లీ తన నట విశ్వరూపం చూపించిన కీర్తి సురేష్ రీసెంట్ గామొన్ననే బేబీ జాన్ సినిమాతో హిందీలో కూడా అడుగుపెట్టిన ఈ భామ ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టింది.

15 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న ఆంటోనీని పెళ్లి చేసుకుని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి అయిన 15 రోజులకే ఆమెపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమె చేతిలో ఇక సినిమాలు లేవు అని, ఉన్న సినిమాలు కూడా కంప్లీట్ చేసేసిందని, ఇకపై తాను ఫ్యామిలీ లైఫ్ ని మాత్రమే ఎంజాయ్ చేయబోతుందని, కొద్దిరోజుల తర్వాత మళ్లీ నటిగా రీఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ రూమర్స్ పట్ల కీర్తి సురేష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

అంతేకాకుండా పెళ్లయిన వెంటనే భర్తతో హనీమూన్ కి వెళ్ళకుండా తన బాలీవుడ్ ఫస్ట్ మూవీ అయిన బేబీ జాన్ మూవీకి ప్రమోషన్స్ కి వెళుతుంది అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. కొందరు మాత్రం ఆమె డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ సినిమా కావటంతో అందుకు తగ్గ అవుట్ ఫిట్స్ వేసుకున్నప్పటికీ సౌత్ ఇండియన్ సాంప్రదాయం ప్రకారం మెడలో తాళిబొట్టు వేసుకొని వెళ్లడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బేబీ జాన్ సినిమా విషయానికి వస్తే వరుణ్ ధావన్ రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో మళ్ళీ తెరపై కనిపిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా బాలీవుడ్ లో విడుదలైన ఈ సినిమా పుష్ప 2 తో పోటీని తట్టుకోలేక పోతుంది. బేబీ జాన్ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ కన్నా పుష్ప 2, 21వ రోజు కలెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే పుష్ప హవా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.